- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YCP: ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తాం : బొత్స
ప్రజల వాణిని వినిపించేది, ప్రజల కష్టాలను ఎత్తి చూపేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షంకు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల వాణిని వినిపించేది, ప్రజల కష్టాలను ఎత్తి చూపేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షంకు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(botsa satyanarana) అన్నారు. వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, సభలోనే ప్రజల గొంతును వినిపించే ప్రతిపక్షంను లేకుండా చేయాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను బహిష్కరించి, సభ నుంచి బాయ్ కాట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో పలువురు నేతలు మాట్లాడుతూ సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, మరొకటి ప్రతిపక్షంగా నిలుస్తున్న వైయస్ఆర్(YCP) సీపీ. కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం అన్నారు. దానితో పాటు మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాలను గురించి ప్రశ్నించామని తెలిపారు. వైయస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు వెళ్ళిన తరువాతే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్ళు చేయడం లేదన్నారు. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు. కానీ మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్ళిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవన్నారు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా తమకు సరైన సమయం ఇవ్వాలని డిమాండ్చేశారు. మార్కెటింగ్ ఇంట్రవెన్షన్ జరిగాలే తప్ప కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని ఇప్పుడు మిర్చి రైతుల గోడును గాలికి వదిలేయకూడదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కల్పించకూడదన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైయస్ఆర్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోందన్నారు. ప్రతిసారీ గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ అవహేళన చేస్తోందన్నారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనలోనే కేవలం అధికార పక్షం మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.






