Rajini : అందరి సంగతి తేలుస్తాం : మాజీ మంత్రి రజిని మాస్ వార్నింగ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-08 09:42:46  IST  )

వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని తన రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్.జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తెలుస్తాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుల్లారావును హెచ్చరించారు

Rajini : అందరి సంగతి తేలుస్తాం : మాజీ మంత్రి రజిని మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని తన రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్.జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తెలుస్తాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుల్లారావును హెచ్చరించారు. నా 7 ఏళ్ల రాజకీయం ముందు నీ 25 ఏళ్ల రాజకీయం తల దించుకుందని..నాపైనా, మా పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు బలంతో ఎదుర్కొంటామన్నారు. నీకు మరో నాలుగేళ్లు సమయం ఉందని..అధికారంతో అందిన కాడికి దోచుకుని కూడబెట్టుకుని రిటైరైపోదామనుకుంటున్నారని..కాని నేను 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయం ఇక్కడే చేస్తానని.. మీరు ఎక్కడ ఉన్న, ఏ ఊరిలో దాక్కున్న మీమ్మల్ని వదిలిపెట్టబోనని లాక్కొస్తామని..వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.

పుల్లారావును చూసుకుని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని..అటువంటి వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరి సంగతి తెలుస్తామన్నారు. అధికారులంటే తనకు గౌరవం ఉందని..కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని..అటువంటి అధికారులను భవిష్యత్తులో వదిలేది లేదన్నారు. మా జోలికి వచ్చి మమ్మల్ని తప్పుడు కేసుల్లో బనాయిస్తే అందుకు బదులు తీర్చుకుంటామని రజిని స్పష్టం చేశారు.

విడుదల రజినిపై తాజాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆమెకు పీఏలుగా పనిచేసిన ఎన్‌.జయ ఫణీంద్ర, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణపై కూడా కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన టీడీపీ దళిత నాయకుడు పిల్లి కోటి 2019లో పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి హోదాలో సోషల్‌మీడియాలో రజిని చట్ట వ్యతిరేక వ్యవహారాలకు సంబంధించి పోస్టులు పెట్టారు. అందుకు కోటిని ఐదు రోజులు పాటు చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేశారు. నాటి ఘటనపై పోలీసులకు ఆయన తాజాగా ఫిర్యాదు చేయగా..దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయడంతో రజిని ఫైర్ అయ్యారు.

Next Story