- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం: మంత్రి డీవీబీ హామీ
దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే 44 ఏళ్ల సుదీర్ఘకాలంగా నిరంతర ప్రజాసేవలో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతోందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కొనియాడారు...

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే 44 ఏళ్ల సుదీర్ఘకాలంగా నిరంతర ప్రజాసేవలో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతోందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కొనియాడారు. కొండపి మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి డోలా తెలిపారు. "స్త్రీశక్తి"(Stree Shakti) అనే ప్రత్యేక థీమ్‌తో మహిళలకు అన్ని అవకాశాల్లో సగభాగం కల్పించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని వివరించారు. 'కార్యకర్తే అధినేత' అనే నినాదంతో పాటు మహిళా లోకాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు టీడీపీ(Tdp) కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కీలక తీర్మానాన్ని మహానాడు వేదికగా ఆమోదించినట్లు ఆయన ప్రకటించారు.
రాబోయే 40 ఏళ్లు యువ నాయకత్వానిదే
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మంత్రి డోలా స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయన్నారు. ముఖ్యంగా యువతకు రాజకీయాల్లో, పాలనలో ప్రాధాన్యత పెరుగుతుందని చెప్తూ.. రాబోయే 40 ఏళ్ల పాటు యువ నాయకత్వమే రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపిస్తుందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధీమా వ్యక్తం చేశారు.






