- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్‌లో చర్చిస్తాం.. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు
by Kema Shiva Kumar |
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ (Lok Sabha)లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి చర్చిస్తామని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన దురాగతాలను బట్టబయలు చేస్తామని వెల్లడించారు. కేసులో కీలక నిందితుడైన ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)ని సిట్ బృందం విచారిస్తున్నందున ఈ విషయంలో ఇంకా ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. పార్లమెంట్‌లో రైతుల సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై కూడా ప్రస్తావిస్తామని అన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని సకాలంలో నెరవేరుస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.
Next Story






