- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో క్లీన్‌చిట్‌తో బయటికి వస్తాం: కోట వినుత
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజవర్గ ఇన్‌ఛార్జిగా పని చేసిన వినుత కోట, ఆమె భర్త కోట చంద్రబాబు తమ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజవర్గ ఇన్‌ఛార్జిగా పని చేసిన వినుత కోట, ఆమె భర్త కోట చంద్రబాబు తమ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. డ్రైవరు శ్రీనివాసులు(రాయుడు) జులై 7న హత్యకు గురయ్యాడు. అదే నెల 13న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో వినుత కోట, ఆమె భర్త కోట చంద్రబాబుతో పాటు వారి అనుచరులు ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వినుత కోట కండిషన్ బెయిల్ పై బయటకు రాగా.. మిగిలిన నలుగురు జైలులో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. డ్రైవర్ రాయుడు హత్యకు గురి కాక మునుపు తీసిన సెల్ఫీ వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో పలు టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడంతో.. శ్రీకాళహస్తి తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వినుత కోట, ఆమె భర్త కోట చంద్రబాబును చంపేందుకు కుట్ర చేసినట్లు.. ఇందుకోసం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఒప్పందం కుదుర్చుకుని.. ముందస్తుగా రూ.20 లక్షలు ఇచ్చారని రాయుడు తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు. వినుత కోట దంపతులను చంపడానికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు అతను ఆ వీడియోలో పేర్కొన్నాడు. కాగా ఈ సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో కోట వినుత స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ కంటే, హత్య చేశారని చెప్పడమే బాధగా ఉందని అన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని, కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేనని, డ్రైవర్ రాయుడు హత్య కేసులో మా ప్రమేయం లేదని, త్వరలో నిజాలు బయటకు వస్తాయని, ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను బయట పెడతానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నానని, నిజానిజాలు ఆ శివయ్యకు తెలుసని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సందర్భంగా కోట వినుత చెప్పుకొచ్చారు.






