AP Deputy CM:డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం: పవన్ కళ్యాణ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-14 04:17:24  IST  )

భారత రాజ్యంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) 134వ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆ మహనీయునికి నివాళులర్పించారు.

AP Deputy CM:డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం: పవన్ కళ్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: భారత రాజ్యంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) 134వ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని రాజ్యాంగంలో అత్యుత్తమమైనది మన దేశ రాజ్యాంగం. కుల, మత, జాతి, లింగ వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు.

నేడు(ఏప్రిల్ 14) ఆయన జయంతిని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్థికాంశాల కంటే సామాజిక పరమైన అంశాలే వెనుకబాటుతనానికి కారణాలుగా ఉంటున్నాయని గ్రహించిన మేధావి అంబేద్కర్. తన జీవితానుభవాలు, ఉన్నత విద్య అందించిన విజ్ఞానం, సమసమాజ స్థాపన చేయాలనే తపనతో రాజ్యాంగ రూపకల్పన యజ్ఞం చేపట్టారు.

వెనుకబడిన, పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలలో ఆత్మన్యూనత పారదోలి విద్యతోపాటు అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించాలనే అంబేద్కర్ సత్సంకల్పం పాలకవర్గాలకు దిక్సూచిలా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ స్ఫూర్తిని భావి తరాలకు అందించేందుకు కట్టుబడి ఉంది. ఆ మహనీయుని జీవితంతో ముడిపడ్డ జన్మభూమి, శిక్షా భూమి, దీక్షాభూమి, చైత్య భూమి, పరినిర్వాణ భూమి ప్రాంతాలను చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసింది.

సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమంతో పాటు వారి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో డా.సుధాకర్ అవమానకర పరిస్థితిని ఎదుర్కొని చనిపోయిన విషయాన్ని, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైనాన్నీ ఎవరూ మరువరు. ఈ ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. కూటమి పాలనలో ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story