ఏపీలో లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరతాం: Daggubati Purandeswari

by Disha Web Desk 21 |
ఏపీలో లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరతాం: Daggubati Purandeswari
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో లిక్కర్ స్కామ్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పోరుబాటపట్టారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను కోరతామని ప్రకటించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అతిపెద్ద స్కామ్ అని అన్నారు. ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారింగా వైసీపీ నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని పురంధేశ్వరి కోరారు. ప.గో. జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని గురువారం పురంధేశ్వరి తనిఖీ చేసిన విషయాన్ని బయటపెట్టారు. ఈ తనిఖీలలో అనేక అక్రమాలు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు. రూ.లక్ష వరకు ఆ సమయానికి విక్రయాలు జరిగితే.. అందులో డిజిటల్‌ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనన్నది తమ పరిశీలనలో తేలిందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

Next Story