YS Jagan : రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలి : మాజీ సీఎం జగన్

by Muthe.Rajitha |

రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని తమ పార్టీ ఎంపీలకు ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(AP Former CM Jagan Mohan Reddy) సూచించారు.

YS Jagan : రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలి : మాజీ సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని తమ పార్టీ ఎంపీలకు ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(AP Former CM Jagan Mohan Reddy) సూచించారు. గురువారం వైసీపీ ఎంపీల(YSRCP MPs)తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో(Parliament Sessions) రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఎంపీలు గట్టిగా నిలదీయలని తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై మరింత స్పష్టతనివ్వాలని, ఈ విషయంలో ఎంపీలు ప్రధానికి విన్నవించాలని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించడం వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, దీనిపై కేంద్రం చొరవ తీసుకునేలా.. సమస్యను తెలియజేయాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలియజేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగే విధానం జమిలి ఎన్నికలకు జరపాలి అనుకుంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయాలని పేర్కొన్నారు. త్వరలో మొదలవబోయే పార్లమెంటు సమావేశాలపై జగన్ తమ ఎంపీలకు పలు ముఖ్య విషయాలు సూచిస్తూ దిశా నిర్ధేశం చేశారు.

Next Story