సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి : మాజీ ఉపరాష్ట్రపతి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-14 04:54:42  IST  )

సందేశాత్మకమైన పండుగలకు నెలవు భారతీయ సంస్కృతి.

సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి : మాజీ ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్ : జీవితంలో ప్రతికూల ఆలోచనలను వదిలి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. సంక్రాంతి సంబరాల్లో తొలిరోజైన భోగి పండుగను (Bhogi Celebrations) కుటుంబ సమేతంగా ఆయన జరుపుకున్నారు. నెల్లూరులోని తమ ఇంటి ఆవరణలో భోగి మంటలను పెట్టి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరితో కలిసి భోగి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ తన తరపున, తన కుటుంబ సభ్యుల తరపున భోగి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాలతో కలిసి భోగి మంటలు వేస్తారన్నారు. అవి ప్రతికూల ధోరణిని దహించి వేసి సానుకూల ధోరణిని ఆకళింపు చేసుకోవాలని సందేశాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఈ ఏడాది భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మాజీ ఉపరాష్ట్రపతి మనసారా ఆకాంక్షించారు.

READ MORE ....

ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకున్నారు : ఎంపీ శివనాథ్

Next Story