ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకున్నారు : ఎంపీ శివనాథ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-14 04:53:04  IST  )

కూటమి ప్రభుత్వ పాలనలో విజయవాడ అభివృద్ధి చెందుతోంది.

ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకున్నారు : ఎంపీ శివనాథ్
X

దిశ, వెబ్ డెస్క్ : గత వైసీపీ (YCP) ప్రభుత్వ పాలనలో ప్రతి దానిపై పార్టీ రంగులు.. తమ నేత బొమ్మలు వేయడం పరిపాటిగా ఉండేది. చివరకు ప్రజల ఆస్తులపై కూడా జగన్ బొమ్మను వేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Sivanath) అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి వేడుకలను (Bhogi Celebrations) తన కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆరోపణలు వేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయడాన్ని ఆ పార్టీ వ్యతిరేకిస్తూ జీఓ ప్రతులను భోగి మంటల్లో వేయడాన్ని తప్పుబట్టారు. మెడికల్ కాలేజీలను పీపీపీలో నిర్మించే జీఓలను వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీఓలను ఆ పార్టీ నేతలు కాల్చివేస్తున్నారని విమర్శించారు. పట్టాదారుల పాసు పుస్తకాలపై గత పాలకులు జగన్ బొమ్మను వేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను జారీ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రత్యేక దృష్టి పెట్టి విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. విజయవాడలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారని తెలియజేశారు.

READ MORE ....

సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి : మాజీ ఉపరాష్ట్రపతి

Next Story