- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం.. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ పెడుతున్నారు. ఈ తరుణంలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన మెగా పీటీఎం(పేరెంట్ టీచర్స్ మీటింగ్) బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సీఎం చంద్రబాబు దృష్టికి పాఠశాల సమస్యలు తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
దీంతో అదే వేదికపై నుంచి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఏడాదిలోగా అన్ని వసతులు కల్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్‌లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్‌తో కూడిన మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. పాఠశాలలో వసతుల కల్పనలో భాగంగా కృషి చేసిన అందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. మంచి ఫలితాలు సాధించి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పేరు నిలబెట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులను కోరుతున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






