- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూసమస్యలను సీఎం సహకారంతో పరష్కరించాం : ఎమ్మెల్యే
కందుకూరు నియోజకవర్గంలోని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ భూ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో పరిష్కరించామని నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు (MLA Inturi Nageshwara Rao) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కందుకూరు నియోజకవర్గంలోని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ భూ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో పరిష్కరించామని నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు (MLA Inturi Nageshwara Rao) అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కందుకూరులో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ భూములు గత 20 ఏళ్లుగా 'గర్భకండ్రిక' జాబితాలో ఉన్నాయన్నారు. దాని కారణంగా భూముల రిజిస్ట్రేషన్లు (Land Registrations) నిలిచిపోయాయని పేర్కొన్నారు.. సీఎం సహకారంతో ఇటీవలే ఆ సమస్యను పరిష్కరించి, ఆ భూములకు మోక్షం కల్పించామన్నారు. కాలనీలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. రెవెన్యూ శాఖ నుంచి కాలనీ మ్యాప్, ప్లాట్ల వివరాలు తెప్పించుకొని... వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అందే విషయంలో ప్రజలు చిన్న ఇబ్బంది కూడా పడకూడదన్నదే తన ఆశయం అని ప్రకటించారు.
ఎలాంటి నష్టం జరగదు
మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి తప్ప ఎలాంటి నష్టం జరగదని ఎమ్మెల్యే నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాల్సింది పోయి, ముట్టడిస్తాం, విధ్వంసం చేస్తాం అంటే తమ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడైనా అభివృద్ధికి సూచనలిస్తే తప్పకుండా తీసుకుంటాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని సమర్థిస్తోందని పేర్కొన్నారు. అయినా కూడా వైసీపీ నేతలు కావాలని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వీలైనంత త్వరగా వైద్య కలళాశాలలు అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులు, పేదలకు మేలు జరుగుతందని తెలిపారు. ఇల్లు ముట్టించడానికి, యుద్ధాలు చేయడానికి కాదు ప్రజాసేవ కోసం తాము ఉన్నామని స్పష్టం చేశారు. కేవలం వైసీపీ నేతల భ్రమల వల్లనే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరమితం చేశారని విమర్శించారు. 11 సీట్లకు పరిమితం చేసినా కూడా వైసీపీలో మార్పు రాలేదని అర్థమైందన్నారు. ఇప్పటికైనా విద్వేషాలను వీడాలని సూచించారు. దౌర్జన్యాలు, దొమ్మిలతో ప్రభుత్వాన్ని భయపెట్టలేరన్నారు.






