- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడితో మాకు సంబంధం లేదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) ఇంటిపై సోమవారం రాత్రి దుండగులు దాడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) ఇంటిపై సోమవారం రాత్రి దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నీచర్‌తో సహా కార్లు పూర్తిగా ధ్వసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందనే విషయం తెలియగానే వైసీపీ (YCP) కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో స్పాట్‌కు చేరుకున్నారు. ఈ దాడి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి (MLA Prashanthi Reddy) చేయించిందని ఆరోపిస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో తాజాగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి (MLA Prashanthi Reddy) స్పందించారు. ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడులు చేసే సస్కృతి తమది కాదని అన్నారు. అయినా, ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చాలామంది చెప్పుకోలేని బాధలు అనుభవించారని కామెంట్ చేశారు. వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చని కదా అని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక్కటే ప్రశ్న అని.. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను మీ ఇళ్లలోని మహిళలకు చూపించాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ (Jagan) సీరియస్‌గా తీసుకోవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.






