ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర సృష్టించాం : మంత్రి నాదెండ్ల మనోహర్

by Naga Rani Yarlagadda |

ఈసారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర సృష్టించాం : మంత్రి నాదెండ్ల మనోహర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈసారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర సృష్టించామని తెలిపారు. వైసీపీ పాలనలో ధాన్యం కొనుగోళ్ల విషయం రైతులు, కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని .. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు. రైతులు కోరుకున్న మిల్లుల్లోనే ధాన్యాన్ని అమ్మే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.

Next Story