‘సరికొత్త రికార్డు సాధించాం’.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-22 04:38:08  IST  )

ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిన విషయం తెెలిసిందే.

‘సరికొత్త రికార్డు సాధించాం’.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిన విషయం తెెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఈ తరుణంలో యోగాలో ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 3,00,105 మంది పాల్గొని రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ పోస్ట్ చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బ్రాండ్ విశాఖ వేదికగా సరికొత్త రికార్డు సాధించామన్నారు. యోగాంధ్రను అద్భుతమైన విజయంగా మార్చడంలో స్ఫూర్తిదాయక నాయకత్వం మరియు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంలో భాగస్వాములైన టీడీపీ నేతలు, శ్రేణులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గొప్ప వేడుకను సాధ్యం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన జిల్లా పరిపాలన, పోలీసు దళాలు, ఆయుష్ & ఆరోగ్య శాఖలు, పాఠశాల మరియు ఉన్నత విద్యా శాఖ, GVMC, పర్యాటక అధికారులు మరియు అన్ని సిబ్బంది యొక్క అవిశ్రాంత కృషికి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story