- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు ఊరట.. మరోవైపు సీబీఐ కీలక నిర్ణయం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని సీబీఐ (CBI) అధికారులు పేర్కొన్నారు. అందుకు కోర్టు తగిన ఆదేశాలిస్తే.. తాము దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
నిందితులకు ఊరట..
అలాగే, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశంపై కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితుల బెయిల్ రద్దు అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ అయిన వైఎస్ సునీతకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సునీత తరపు లాయర్ కోరారు. సీబీఐ ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అంతకు ముందు సీబీఐ తరపు లాయర్.. కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా కూడా బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడంతో నిందితులకు ఊరట లభించినట్లైంది.






