శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. దిగువకు నీటి విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-28 03:02:14  IST  )

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. దిగువకు నీటి విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు ఇన్‌ఫ్లో 1,27,392 వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది.

శ్రీశైలం జలాశయం రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉంది.



Next Story