- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్‌లో నీళ్లు.. ఆందోళనలో వాహనదారులు
ఈ మధ్య కాలంలో పెట్రోల్‌లో నీళ్లు వస్తున్న ఘటనలు వాహనదారులకు ఆందోలన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఓ బంకులో పెట్రోల్ లో నీళ్లు రాగా తాజాగా ఏపీలో రెండు చోట్ల అలాగే జరిగింది. కాకినాడ భారత్ పెట్రోలియం బంకులో పెట్రోల్ తో పాటు నీళ్లు వచ్చిందని కస్టమర్లు ఆందోళన చేపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో పెట్రోల్‌లో నీళ్లు వస్తున్న ఘటనలు వాహనదారులకు ఆందోలన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఓ బంకులో పెట్రోల్ లో నీళ్లు రాగా తాజాగా ఏపీలో రెండు చోట్ల అలాగే జరిగింది. కాకినాడ భారత్ పెట్రోలియం బంకులో పెట్రోల్ తో పాటు నీళ్లు వచ్చిందని కస్టమర్లు ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌ను బాటిల్ లో పట్టుకోగా నీళ్లు పైకి తేలడంతో సిబ్బందిని ప్రశ్నించారు.
కానీ సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు మీకు దిక్కున్న చోటచెప్పుకోండని నిర్వాహకులు ఫైర్ అయ్యారు. దీంతో కస్టమర్లు మూడు గంటల పాటు బంక్ ముందే ఆందోళనకు దిగారు. దీంతో బంక్ క్లోజ్ చేసి నిర్వాహకులు అక్కడ నుండి వెళ్లిపోయారు. మరోవైపు నిన్న తునిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తునిలోని ఓ బంకులో పెట్రోల్ లో నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. వరుస ఘటనలతో వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఎక్కడ నీళ్లు వచ్చి పాడైపోతాయోనని కస్టమర్లు టెన్షన్ పడుతున్నారు.






