- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి మరణానికి 'ఆ' సంబంధమే కారణమా?
వివాహేతర సంబంధాలు వ్యక్తులకు సంతోషాన్నిస్తే కుటుంబాలను వీధులకీడుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఓ మహిళను చంపి.. తాను బలవన్మరణం చెందాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ (Tirupati East) పరిధిలోని కొర్లగుంట మారుతీనగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సోమశేఖర్ అనే వ్యక్తి గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి జీవకోనకు చెందిన ఓ మహిళతో (Jeevakona Women) పరిచయం ఏర్పడింది. అయితే ఆ మహిళకు అప్పటికే వివాహం అయ్యింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం బలపడి వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి వివాహితను మాట్లాడటానికి పిలిచి ఉంటాడని అనుకుంటున్నారు. మాటల్లో వాగ్వాదం జరిగి ఉండొచ్చని.. దాంతో గొడవ జరిగి నిందితుడు దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అతని దాడిలో వివాహిత మరణించడంతో ఆందోళనకు గురైన నిందితుడు తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి విచారణ తరువాతే నిజానిజాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొంటున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని తనకల్లులో పోలీసు స్టేషన్ ఎదుటే ఈశ్వరప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు వివాహేతర సంబంధం కారణం కావడం గమనార్హం. సమాజంలో నానాటికీ ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివాహ బంధాలు నవ్వులపాలు కావడమే కాకుండా వ్యక్తుల జీవితాలను, కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.






