ఫ్రీ బస్ ఎఫెక్ట్: ఈ రాష్ట్రంలోనూ ప్రారంభమైన మహిళల యుద్ధాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-18 13:41:42  IST  )

ఫ్రీ బస్సు జర్నీ అమలులో రాష్ట్రంలోనూ మహిళల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి...

ఫ్రీ బస్ ఎఫెక్ట్: ఈ రాష్ట్రంలోనూ ప్రారంభమైన మహిళల యుద్ధాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఉచిత బస్సు పథకం అమలు కొనసాగుతోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడు రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలుచోట్ల అరుపులు, కేకలతో సాగుతున్నాయి. ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు బస్సులోనే కొట్టుకునేంత పని జరిగింది. అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్లు వరకు వెళ్లకుండా పంచాయితీ సమసిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో ఏపీలోనూ మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి ఘటనలో ఇంకా చూడాల్సి ఉంటుందని పోస్టులు పెట్టారు.

వీడియో...

Next Story