ఏపీలో గాలివాన బీభత్సం.. భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక

by Ramesh Naini |

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో గాలివాన బీభత్సం.. భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చింతపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

అల్లూరి జిల్లా చింతపల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి రోడ్లపై భారీగా చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానికులు స్వచ్ఛందంగా స్పందించి చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించారు. కాగా, విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

వాతావరణ శాఖ హెచ్చరికలు

విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 18 నాటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. దీనికి తోడు దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి గాలుల తీవ్రత పెరిగి రేపు గంటకు 40-50 కి.మీ వేగంతో, ఎల్లుండి మరింత తీవ్రంగా 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Next Story