- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anna Canteen: భోజనానికి అన్నా క్యాంటిన్‌కు వెళ్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Anna Canteen: అన్నా క్యాంటిన్ (Anna Canteen)భోజనం చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అర్హతలు అక్కర్లేదు. చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.

దిశ,వెబ్‌డెస్క్: Anna Canteen: అన్నా క్యాంటిన్ (Anna Canteen)భోజనం చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అర్హతలు అక్కర్లేదు. చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. కడుపునిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు(Anna Canteen) ఆకలి తీర్చుతున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటిన్ కు బారులు తీరుతున్నారు.
అయితే ఒంగోలు(Ongole)లోని కొత్త పట్నం బస్టాండ్(New Patnam Bus Stand) సెంటర్ లో ఏర్పాటు చేసిన ఓ అన్నా క్యాంటిన్ (Anna Canteen) ముందు హెచ్చరిక బోర్డు(Warning board) పెట్టారు. అందులో ఏం రాసారంటే మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టము..అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్లుగా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండటం..నానా రచ్చ చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం కోసమే ఏపీలో అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది మందుబాబులు అన్నా క్యాంటిన్స్ లో ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకే బోర్డులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హెచ్చరిక బోర్డులు ఒంగోలు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మద్యం తాగి వచ్చేవారికి అన్నం పెట్టేది లేదని.. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్నప్పుడు.. హోటల్స్ కు వెళ్లి తినాలని..ఇవి కేవలం పేదల కోసం ౫ రూపాయలకే భోజనం పెడుతుంటే ఇలాంటి వాళ్లు దుర్వినియోగం చేయడం మంచి పద్దతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు.






