- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయాన్నే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఈ క్రమంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు తీవ్ర వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మే నెలలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని APSDMA వెల్లడించింది.
ఈ తరుణంలో ఏపీ(Andhra Pradesh)లో 41°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. కాకాణిలో 43.7, ఇంకొల్లులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 116 ప్రాంతాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు-11, అనకాపల్లి జిల్లా-8 మండలాల్లో తీవ్ర వడగాలులు(19), మరో 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు అల్లూరి సీతారామరాజు-8, అనకాపల్లి-16, అనంతపురం-4, అన్నమయ్య-1, చిత్తూరు జిల్లా కుప్పం మండలాల్లో(30) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన ఎండ ప్రభావం, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.






