మంత్రి నారా లోకేశ్ కు ఘన స్వాగతం

by Thanuru Gopichand |

కాకినాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి.

మంత్రి నారా లోకేశ్ కు ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నేడు కాకినాడ (Kakinada) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరం (Rajamahendravaram) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకు బయలుదేరిన లోకేశ్‌కు బూరుగుపూడి గేటు వద్ద పార్టీ శ్రేణులు నీరాజనాలు పలికారు. తన పర్యటనలో భాగంగా మంత్రి కాకినాడ జేఎన్టీయూను సందర్శించి అక్కడ నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి విద్యార్థులతో 'హలో లోకేశ్' కార్యక్రమంలో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వీటితో పాటు కాకినాడలోని కోరమండల్ ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రి ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులతో పాటు పార్టీ బలోపేతంపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మంత్రి రాకతో కాకినాడ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Next Story