వక్ఫ్ సవరణ బిల్లుపై వార్.. టీడీపీ ట్వీట్ కు వైసీపీ కౌంటర్

by Ramesh Goud |

రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై డ‌బుల్ గేమ్ ఆడింది మీరు కాదా చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

వక్ఫ్ సవరణ బిల్లుపై వార్.. టీడీపీ ట్వీట్ కు వైసీపీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై డ‌బుల్ గేమ్ ఆడింది మీరు కాదా చంద్రబాబు (Chandrababu) అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ట్వీట్ చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీలో అధికార విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని టీడీపీ విమర్శలు చేస్తోంది. దీనిపై ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కపట ప్రకటనలు చేసిన వైసీపీ అదే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని, ఇదీ జగన్ (Jagan) మార్క్ డబుల్ గేమ్‌ (Mark Double Game) అని టీడీపీ పార్టీ (TDP Party) రాసుకొచ్చింది. దీనికి వైఎస్ఆర్సీపీ (YSRCP) ఆధారాలతో సహా స్పందిస్తూ.. టీడీపీకి కౌంటర్ ఇచ్చింది.

ఈ సందర్భంగా.. ఎన్నిక‌ల ముందు మైనార్టీల ఓట్ల కోసం వారికి మాయ‌మాట‌లు చెప్పింది ఎవ‌రు అని, వారి ఓట్లతో గ‌ద్దెనెక్కింది టీడీపీ కాదా అని ప్రశ్నించింది. అలాగే ముస్లింల‌కు అన్యాయం జ‌రిగితే రాజీనామాలు చేస్తామ‌న్నది మీరు కాదా అని, తీరా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు ఓటింగ్‌కు వ‌చ్చే స‌రికి ముస్లింల‌కు వెన్నుపోటు పొడుస్తూ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్దతుగా ఓటు వేసింది మీరు కాదా అని నిలదీసింది. అంతేగాక రాష్ట్రంలో మీకు ముస్లింలు అంద‌రూ వ్యతిరేకం అవుతున్నార‌ని తెలిసి వైయ‌స్ఆర్‌సీపీపై ప‌చ్చి అబ‌ద్ధాలు, నీచ రాజ‌కీయాలు చేస్తున్నది మీరు కాదా అంటూ.. మీ అస‌త్యాల‌కు కాలం చెల్లిందని మండిపడింది. ఇదిగో.. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తూ విడుద‌ల చేసిన లెట‌ర్‌ అని, వ‌క్ఫ్‌బిల్లును వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకించిన‌ట్లు జాతీయ మీడియానే కాదు.. మీ ఎల్లో మీడియా కూడా చెప్పిందని వైసీపీ వ్యాఖ్యానించింది.

Next Story