- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారాపై యుద్ధం.. నవోదయానికి శ్రీకారం
సారాపై యుద్ధం చేయడానికి నవోదయం 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో : సారాపై యుద్ధం చేయడానికి నవోదయం 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్సైట్ ప్రారంభించి విద్యార్థులతో ప్రమాణం చేయించారు.అనంతరం జెండా ఊపి నవోదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మన దేశానికి, రాష్ట్రానికి యువతే అంత్యంత ముఖ్యమైన సంపదన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపై ఉందని తెలిపారు. 2016లో నవోదయం కార్యక్రమంతో దాదాపు 10 జిల్లాల్లో నాటు సారాను నిర్మూలించామన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం నవోదయాన్ని గాలికి వదిలి ఊరూరా సారాను విస్తరించిందని ఆరోపించారు. అంతవరకు అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లను దూరం చేసి కల్తీ బ్రాండ్లను ప్రజలు నెత్తిన రుద్దారని విమర్శించారు. ఫలితంగా ప్రజలంతా సారా వైపు మరలారని ఆరోపించారు. మత్తు కోసం రకరకాల రసాయనాల వినియోగంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను చెందిన వారు జగన్ రెడ్డి ధన దాహానికి బలైపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో అలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా చూడాలని లక్ష్యంతోనే నవోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గంజాయి, డ్రగ్స్, సారా విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆరు నెలల్లో నూరు శాతం గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రవీంద్ర తెలిపారు.






