- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింఛన్ కోసం వైన్ షాప్ వద్ద ఎదురుచూపు!
ఇంటి వద్దకు సామాజిక పింఛన్లు రావట్లేదంటున్న పెద్దలు.

దిశ, వెబ్ డెస్క్ : పింఛన్ (Pension) సమయానికి వస్తుందనే నమ్మకం ఉంది గానీ.. ఇంటి దాకా వచ్చి అందే పరిస్థితులు మాత్రం లేవంటున్నారు విశాఖ తూర్పు (Visaka East) నియోజకవర్గానికి చెందిన పలువురు పింఛన్ దారులు. అందులోనూ ఓ వైన్ షాప్ వద్ద పింఛన్ డబ్బుల కోసం వారు ఎదురు చూస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వీడియో తీస్తూ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లాడు. మీరెందుకు వైన్ షాప్ (Wine Shop) వద్ద ఉన్నారని వారిని ప్రశ్నించాడు. తాము పింఛన్ కోసం ఇక్కడున్నామని వారిలోని కొందరు సమాధానం ఇచ్చారు. పింఛన్ కోసం వైన్ షాప్ వద్ద ఉన్నారా అంటే.. అవును అని అమాయకంగా సమాధానం చెప్పారు. తమను పింఛన్ డబ్బుల కోసం ఇక్కడ వేచి ఉండాలని చెప్పారని.. అందుకే తాము ఇక్కడ ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి వేచి ఉన్నా ఇంకా ఎవరూ రాలేదంటున్నారు. పింఛన్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు కదా అంటే.. ఇంటి వద్ద అందడం లేదని సమాధానమిచ్చారు. ఈ వీడియో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని మద్దిలపాలెం వద్దనున్న ఎంఆర్ సీ లిక్కర్ షాపు వద్ద రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. నిజంగానే వృద్ధులు ఎదురు చూస్తున్నట్లు అయితే వారి సమస్యకు తగిన పరిష్కారం చూపించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






