మద్యం తాగి విధులకు హాజరైన వీఆర్వో.. వైరల్‌గా దృశ్యాలు

by Vemula.Srinu Prasad |

మద్యం తాగి విధులకు హాజరైన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది...

మద్యం తాగి విధులకు హాజరైన వీఆర్వో..  వైరల్‌గా దృశ్యాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari) పెనుమంట(Penumanta) మండలం ఆలమూరు(Alamuru)లో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటన చేస్తుండగా వీఆర్వో మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. ఆచంట మండలం పెకలంక మండలం వీఆర్వో(VRO)గా పని చేస్తున్నారు. అయితే మద్యం షాపులో మందు తాగుతున్న వీఆర్వో దిగమర్తి చిన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చిన్నపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఓ పార్టీకి వీఆర్వో చిన్న అనుకూలంగా పని చేస్తున్నారని, అందుకే ఆయనపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు మండిపడుతున్నారు.

Next Story