- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News: ఆ జిల్లాలో 150 మంది వాలంటీర్లు రాజీనామా
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పరిధిలో 150 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పింఛన్‌దారులకు వార్డు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఈ ఆంక్షలతో సచివాలయాల్లో లబ్ధిదారులు పింఛన్లు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలు ఇంటింటికి తిరిగి అందజేసిన వాలంటీర్లు ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పరిధిలో 150 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో ఎంతో ధైర్యసాహసాలతో తామ విధులను నిర్వహించమని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా విధులు నిర్వహించామని తెలిపారు.
Next Story






