ప్రగతి పథంలో ఉత్తరాంధ్ర: గజపతుల గడ్డపై మరో మణిహారం

by Vemula.Srinu Prasad |

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ. 1.05 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్లార్ మిత్తల్ గ్రూప్ ఈ ప్లాంట్‌ను నిర్మించనుంది....

ప్రగతి పథంలో ఉత్తరాంధ్ర: గజపతుల గడ్డపై మరో మణిహారం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandra) ముఖచిత్రాన్ని మార్చే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ ప్లాంట్‌(Greenfield Steel Plant)ను ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ. 1.05 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్లార్ మిత్తల్ గ్రూప్(ArcelorMittal Group) ఈ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఈ భారీ ప్రాజెక్టుకు త్వరలోనే సీఎం చంద్రబాబు(Cm Chandrababu) శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాల లభించనున్నాయి.

జగన్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం

కాగా వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడింది. అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తోంది. ఈ ప్రాంత వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోంది.

ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టం

దీంతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలు సైతం భారీగా వచ్చే అవకాశం ఉందని ఆయన ఆకాంక్షించారు. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చంద్రబాబు నాయుడు చూపుతున్న చొరవ వల్లే ఈ భారీ ప్రాజెక్టు సాధ్యమైందని కలిశెట్టి కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరబోతోందని, ఈ ప్రాంతం పారిశ్రామిక రంగంలో నెంబర్ వన్‌గా నిలుస్తుందని ఎంపీ కలిశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story