మహిళల రక్షణలో సీఎం ఫెయిల్: Ex Mla Satyanarayana

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-08 11:18:06  IST  )

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణలేదని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు...

మహిళల రక్షణలో సీఎం ఫెయిల్: Ex Mla Satyanarayana
X

దిశ, అనకాపల్లి: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణలేదని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం జగన్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. లేని దిశా చట్టం పేరుతో మహిళలని జగన్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబుతో జూమ్ మీటింగ్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మహిళలతో చంద్రబాబు నాయుడు కొద్ది సేపు మాట్లాడారు. అనంతరం పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాక్షలు తెలియజేశారు. టీడీపీ హయాంలో మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆదరణ పథకం పెట్టీ, కుట్టు మిషన్లు ఇచ్చామని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి, టీడీపి రాష్ట్ర మహిళా ఉఫాధ్యక్షురాలు కొణతాల రత్న కుమారి, సేనాపతి స్వరూపా, శంకర్ల పద్మలతా,తెలుగు మహిళ నాయకులు కాయల ప్రసన్న కుమారీ, ఉడతా పద్మా, అమరావతి, సూర్య ప్రభా, సీరంశెట్టి వెంకట లక్ష్మి, మాదంశెట్టి నీలబాబు, దేవి తదితరులు పాల్గొన్నారు.

Next Story