- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ప్రజలకు శుభవార్త... రేపటి నుంచి ప్రత్యేకంగా సమ్మర్ ట్రైన్స్
ఆంధ్రప్రదేశ్ (AP ), తెలంగాణ ( Telangana) రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (AP ), తెలంగాణ ( Telangana) రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ( Summer Special Trains) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ( South Central Railway ) అధికారిక ప్రకటన చేసింది. సమ్మర్ హాలిడేస్ ( Summer Holidays) వస్తున్న నేపథ్యంలో... ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.
ఈ లెక్క ప్రకారం విశాఖ నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు నగరాలకు మొత్తం 42 రైళ్లు నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. రేపటి నుంచి మే నెల చివరి వరకు ఈ 42 ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ట్రైన్స్ ఉంటాయి. అలాగే తిరుపతికి కూడా బుధవారం అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కర్నూలు కు మంగళవారం ప్రత్యేకంగా ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే హైదరాబాద్ నగరం నుంచి కూడా ఏపీకి ప్రత్యేక ట్రైన్స్ కూడా ప్రారంభం త్వరలోనే కాబోతున్నట్లు సమాచారం. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఏప్రిల్ మాసం చివర్లో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలలో అన్ని పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. సమ్మర్ హాలిడేస్ ప్రారంభం.. కాగానే చాలామంది... తీర్థయాత్రలకు వెళ్తారు. విహారయాత్రలకు కూడా కొంతమంది వెళతారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా 42 ట్రైన్స్.. అందుబాటులోకి తీసుకువస్తున్నారు.






