- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sabbavaram: కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోరా..!
by Vemula.Srinu Prasad |
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సబ్బవరం రోడ్డులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి..

X
దిశ, కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సబ్బవరం రోడ్డులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూ. మలేరియా, కోవిడ్ వ్యాధులతో అతలాకుతలమవుతున్న తరుణంలో పందులు, కుక్కలు విచ్చలవిడిగా విహరించటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. సమస్య కళ్ళ ముందు కనిపిస్తున్నా చూసీ చూడనట్టు వెళ్ళిపోతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి జనావాసాల్లో పందులు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Next Story






