- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూలు సమీపంలో క్షుద్రపూజలు.. భయాందోళనలో విద్యార్థులు
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి..

దిశ, వెబ్ డెస్క్: మొన్న వెళ్లి ఈ రోజు వచ్చే సరికి స్కూలు సమీపంలో కుద్రపూజలు చేసి ఉన్నాయి. పసుపు, కుంకుమ చల్లి ముగ్గువేసి , అందులో బొమ్మను పెట్టి చుట్టూ నిమ్మకాయలు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా విద్యార్థులు, స్థానికులు భయాందోళనలకు గురియ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బొండపల్లిలో విద్యార్థులు రోజు మాదిరి జెడ్పీ హైస్కూలకు సోమవారం వచ్చారు. అయితే సమీపంలో ఎవరో కుద్రపూజలు చేశారు. నిన్న ఆదివారం కావడంతో స్కూలుకు సెలవు ఉంది. దీన్ని ఆసరగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర ప్రయోగం చేశారు. దీంతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్షుద్ర పూజలు చేసింది గ్రామస్తులను ఉద్దేశించా, స్కూలు విద్యార్థులుకా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానిక సీసీ పుటేజులను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తిస్తామని తెలిపారు. అయితే క్షుద్రపూజలు మూడ నమ్మకాలు మాత్రమేనని, ఎవరూ కూడా భయాందోళనకు గురికావొద్దని పోలీసులు సూచించారు.






