ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు

by velandi.Saikiran |   (  Updated:2025-04-02 10:20:07  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పార్టీ ( Naga babu) సీనియర్ నాయకులు, మెగా

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పార్టీ ( janasena) సీనియర్ నాయకులు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ( Konidela Nagababu). ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి మెగా బ్రదర్ నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు నాగబాబు ( Konidela Nagababu). శాసనమండలి చైర్మన్ ( Chairman of the Legislative Council) మోషేన్ రాజు ( )... నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో జరిగింది.

జనసేన నాయకులు నాగబాబు తో పాటు మరో నలుగురు సభ్యులు కూడా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు ( Somu veerraju), కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర అలాగే బీటీ నాయుడు ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మెగా బ్రదర్ నాగబాబుకు త్వరలోనే బంపర్ ఆఫర్ దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ కేబినెట్ లో నాగబాబుకు ( Konidela Nagababu) అవకాశం రాబోతుందని... సమాచారం అందుతుంది. ఎమ్మెల్సీ అయిన నేపథ్యంలో ఆయనకు ( Konidela Nagababu) పర్యాటక శాఖ ఇస్తారని కూడా.. జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. ఇప్పటికే ఈ విషయం పై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Next Story