ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ.. 8 గంటల పాటు ప్రశ్నల వర్షం

by velandi.Saikiran |

వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ( MP Mithun Reddy ) విచారణ పూర్తయింది. ఏపీ మద్యం కుంభకోణం ( Liquor scan

ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ.. 8 గంటల పాటు ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ( MP Mithun Reddy ) విచారణ పూర్తయింది. ఏపీ మద్యం కుంభకోణం ( Liquor scandal ) కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై సిట్ అధికారుల విచారణ... శనివారం రోజున సాయంత్రం ముగిసింది. ఇవాళ ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి... విచారణ నిమిత్తం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాదాపు 8 గంటల పాటు... ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని... విచారణ చేశారు అధికారులు.

ఈ సందర్భంగా... మిథున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డు చేసి... పూర్తి వివరాలు సేకరించారు. ఈ కుంభకోణం లో భాగంగా... రకరకాల అంశాలపై ఆరా తీసిన అధికారులు... మిథున్ రెడ్డి పై ఎనిమిది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

కొన్ని ప్రశ్నలకు ఆయన దాటివేశారట. న్యాయవాది సమక్షంలోనే మిథున్ రెడ్డిని విచారణ చేశారు అధికారులు. విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ( SIT Chief Rajasekhar Babu)నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి అలాగే చాణక్య రాజు లతో మద్యం పాలసీ పై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా అడిగారట. ఇలా వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నల తో... ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.

Next Story