ఆక్షన్, అప్లికేషన్ రూట్ లో దూసుకు వెళ్తున్నాం - మంత్రి నిమ్మల

by Veldandi saikiran |   ( Updated:2025-04-15 12:29:44.0  )
ఆక్షన్, అప్లికేషన్ రూట్ లో  దూసుకు వెళ్తున్నాం - మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీయల్ మెటీరియల్‌కు ఆక్షన్.. నిర్మాణ రంగానికి మాత్రం అప్లికేషన్ రూట్‌లో అందిస్తామని ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Rama Naidu). మంగళవారం జరిగిన ఏపీ కేబినేట్ ( Ap Cabinet) సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం (YCP) చేసిన అవినీతిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల.

మైన్స్ విషయంలో ఒక్కొక్కటి సరిదిద్ది నిర్మాణం వైపు గ్రానైట్, గ్రావెల్ రోడ్డు మెటీరియల్ ఉపయోగించాలని నిర్ణయించామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh State) జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడారు. తిరుమల అంశంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు హోం మంత్రి అనిత ( Home Minister Anitha).

ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన వ్యక్తి ఇలా అబద్దపు ప్రచారం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నిజాలు లేవని స్వయంగా టీటీడీ ఈఓ శ్యామలరావు స్పష్టం చేశారని తెలిపారు హోం మంత్రి వంగలపూడి అనిత.



Next Story

Most Viewed