మద్యం మత్తులో హెడ్‌ మాస్టర్ వీరంగం.. డిప్యూటీ డీఈఓ ముందే హంగామా..

by Sujitha Rachapalli |

హెడ్ మాస్టర్ పేరు చెప్తే భయంతోపాటు భక్తి పుట్టుకురావాలి. అది ఆయన గౌరవం. కానీ అలాంటి గౌరవం ఏర్పడాలంటే హెడ్ మాస్టర్ కూడా అంతే డిగ్నిటీ మెయింటెన్ చేయాలి. విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేందుకైనా ఆ డిగ్నిటీ మెయింటెన్ చేస్తారు

మద్యం మత్తులో హెడ్‌ మాస్టర్ వీరంగం.. డిప్యూటీ డీఈఓ ముందే హంగామా..
X

దిశ, వెబ్ డెస్క్ : హెడ్ మాస్టర్ పేరు చెప్తే భయంతోపాటు భక్తి పుట్టుకురావాలి. అది ఆయన గౌరవం. కానీ అలాంటి గౌరవం ఏర్పడాలంటే హెడ్ మాస్టర్ కూడా అంతే డిగ్నిటీ మెయింటెన్ చేయాలి. విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేందుకైనా ఆ డిగ్నిటీ మెయింటెన్ చేస్తారు. కానీ ఈయన మాత్రం తాగుడు, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఏంటని విచారణ కోసం వస్తే.. డిప్యూటీ డీఈఓపైనే చిందులు వేశాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో వింతగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్.. డిప్యూటీ డీఈఓపైనే అసభ్య పదజాలాన్ని వాడారు. హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒక్క ఉపాధ్యాయుడే ఇలా తాగి స్కూల్‌కు వస్తే పిల్లలకు విలువల గురించి ఎవరు నేర్పుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

VIDEO

Next Story