- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > విజయనగరం > Breaking: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ట్రాక్‌పై నుంచి కిందకు దిగిన 6 బోగీలు
Breaking: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ట్రాక్‌పై నుంచి కిందకు దిగిన 6 బోగీలు
by Vemula.Srinu Prasad |
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం బొడ్డవర వద్ద ప్రమాదం తప్పింది. ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం బొడ్డవర వద్ద ప్రమాదం తప్పింది. ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వరుసగా ఆరు రైలు బోగీలు పట్టాలపై నుంచి కిందకు దిగాయి. భారీ శబ్ధం రావడంతో అప్రమత్తమైన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపివేశారు. గూడ్స్ రైలు కిరండోల్ నుంచి విశాఖ వెళ్తుండగా పట్టాలు తప్పింది. విషయం తెలుసున్న రైల్వే అధికారులు, సిబ్బంది.. హుటాహుటిన పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్దకు వెళ్లారు. మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లాల్సిన నైట్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. కిరండోల్ నుంచి విశాఖకు రావాల్సిన నైట్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లించారు. ఈ రైలు కిరండోల్ నుంచి కోరాపుట్, రాయగడ మీదుగా విశాఖ చేరుకుంటుందని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
Next Story






