- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగువ వరదతో గోదావరిలో జలకళ.. గండి పోచమ్మ ఆలయం మూసివేత
by Ramesh Naini |
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి జలకళ సంతరించుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి జలకళ సంతరించుకుంది. దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ ఆలయం నీట మునగడంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నిన్నటికే ఇక్కడ నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 60,933 క్యూసెక్కుల వరద చేరుతుండగా, 57,387 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాలువలకు 13,600 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 43,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Next Story






