విజయనగరంలో Chandrababu బసపై డిప్యూటీ స్పీకర్ అనుమానం

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-25 12:34:31  IST  )

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వైసీపీ, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు....

విజయనగరంలో Chandrababu బసపై డిప్యూటీ స్పీకర్ అనుమానం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వైసీపీ, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అలా మూడు రోజులుగా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాత్రి సమయంలో స్థానికంగా బస చేస్తూ ఆ తర్వాత రోజు 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి (Deputy Cm Kolagatla Veerabhadra Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో చంద్రబాబు బసపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రాజకోట కుట్రకు ఎన్‌టీఆర్ పదవీచ్యుతుడయ్యారని చెప్పారు. మరోసారి అలాంటి తప్పేదో జరుగుతుందనే అనుమానం తనకు కలుగుతోందని కోలగట్ల వీరభద్ర స్వామి వ్యాఖ్యానించారు.

Next Story