Train Accident: క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-10-30 09:17:16  IST  )

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు.....

Train Accident: క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వీరికి విశాఖ, విజయనగరం జిల్లా ప్రభుత్వం ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో క్షతగాత్రులను సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ఆయన రైలు ప్రమాదంపై అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

కాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story