- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాబేజీ లోడు మాటున తరలింపు.. ఏపీలో 650 కిలోల గంజాయి పట్టివేత..!
by Ramesh Naini |
విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో నార్కోటిక్ కంట్రోల్ టీమ్ జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో నార్కోటిక్ కంట్రోల్ టీమ్ జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఒడిశా నుంచి ఒక వాహనంలో క్యాబేజీ లోడ్ మాటున గంజాయిని తరలిస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన అధికారులు బొండపల్లి వద్ద సదరు వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేయగా, క్యాబేజీ బస్తాల కింద దాచిన గంజాయి నిల్వలు బయటపడ్డాయి. అధికారులు గంజాయితో పాటు వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్ గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story






