- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయి రెడ్డికి బిగ్ షాక్.. బీజేపీ స్కెచ్ అదుర్స్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( Andhra Pradesh) రాజకీయాలలో... విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy) ఎప్పుడు హాట్ టాపిక్ గానే

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( Andhra Pradesh) రాజకీయాలలో... విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy) ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పటికీ.. మీడియాలో విజయ సాయిరెడ్డి గురించి ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. అయితే అలాంటి విజయసాయి రెడ్డికి.. భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party) ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డికి మరోసారి రాజ్యసభ ( Rajya Sabha) పదవి వస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి.. భారతీయ జనతా పార్టీ ద్వారా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని కూడా చర్చ జరిగింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డికి బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభ సీటు దక్కుతుందని.. కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలకు తాజాగా... భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసింది.
విజయసాయి రెడ్డి స్థానంలో... తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలైకు ( Annamalai) అవకాశం... ఇచ్చేందుకు రెడీ అయిందట భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే ఏపీలోని కూటమి పార్టీలను... బీజేపీ సంప్రదించిందని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో పొత్తు ప్రకటన ఇటీవల జరిగింది. దీంతో జాతీయ స్థాయిలో అన్నామలై సేవలను వినియోగించుకునేందుకు... బీజేపీ పార్టీ వ్యూహాలు రచిస్తోందట. అందుకే రాజ్యసభ పదవిని అన్నా మలైకి ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం.






