హెరిటేజ్ పై వక్ఫ్ బోర్డు బిల్లు ఎఫెక్ట్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-03 18:14:30  IST  )

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో పాపులర్ అయిన హెరిటేజ్ కంపెనీకి ఊహించని షాక్ తగిలింది. హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన వస్తువులను

హెరిటేజ్ పై వక్ఫ్ బోర్డు బిల్లు ఎఫెక్ట్ ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో పాపులర్ అయిన హెరిటేజ్ కంపెనీపై కొందరు రాజకీయ ప్రత్యర్ధులు రాద్ధాంతానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ... కొంతమంది ముస్లిం సంఘాల నేతలు కొత్త వివాదానికి తెర లేపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో... పిచ్చి పిచ్చి పోస్టులు కూడా పెడుతున్నారు. తాజాగా పార్లమెంట్ కు వక్ఫ్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు ( Waqf Amendment Bill ) తెలుగు దేశం పార్టీ కూడా అనివార్య పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.


ఏపీలోని కూటమిలో చంద్రబాబు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అందుకే మోడీ తీసుకు వచ్చిన బిల్లుకు...సీఎం చంద్రబాబు..మద్దతు చెప్పాల్సి వచ్చింది. అయితే... ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి... చంద్రబాబు నాయుడు కు సంబంధించిన వ్యాపారాలను దెబ్బతీసేందుకు కొన్ని సామాజిక వర్గాలు కుట్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కావాలనే కొంత మంది.. తెలుగుదేశం పార్టీకి... ప్రత్యేక సామాజిక వర్గ ఓట్లు దూరం కావాలని కూడా ఈ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే... సీఎం చంద్రబాబు నాయుడు కు సంబంధించిన.. బిజినెస్ ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


Next Story