ఏపీ విద్యార్థులకు శుభవార్త..రూ.300 కోట్లు కేటాయింపు !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ( Andhra Pradesh State )విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు (

ఏపీ విద్యార్థులకు శుభవార్త..రూ.300 కోట్లు కేటాయింపు !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ( Andhra Pradesh State )విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కూటమి ప్రభుత్వం. ఏపీలో హాస్టల్స్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గురుకులాల మరమ్మత్తుల కోసం భారీగా నిధులు కేటాయించింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు... ఏకంగా 300 కోట్లు కేటాయింపు చేసింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ( Dola Sree Bala Veeranjaneya Swamy) ప్రకటన చేశారు.

ఇవాళ విశాఖ ద్వారకా నగర్ లో ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా డిబివి, ఉచిత డీఎస్సీ శిక్షణా కేంద్రాన్ని ( Free DSC training center ) సందర్శించారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అనంతరం అక్కడ ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ మెటీరియల్స్ అందజేశారు. ఆ మెటీరియల్స్ ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ( Dola Sree Bala Veeranjaneya Swamy).

అలాగే ఏపీలో హాస్టల్ నిర్మాణం ( Hostel construction), గురుకులాల మరమ్మత్తుల కోసం 300 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకుఎలాంటి సమస్యలు లేకుండా చూడడం జరుగుతోందని చెప్పారు. అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ దూసుకు పోతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చాలా కష్టాలు పడ్డారన్నారు.

Next Story