YCP: అనకాపల్లిలో మానవహారం.. గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు

by Vemula.Srinu Prasad |

సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన సెంటు స్థలం శవాలు పూడ్చడానికి కూడా పనికి రాదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు...

YCP: అనకాపల్లిలో మానవహారం.. గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు
X

దిశ, అనకాపల్లి: సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన సెంటు స్థలం శవాలు పూడ్చడానికి కూడా పనికి రాదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రం నాలుగు రోడ్లు జంక్షన్‌లో ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పేదలకు బాసటగా నిలబడి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని వైసీపీ రాష్ట్ర నాయకులు దంతులూరు దిలీప్ కుమార్ అన్నారు. గతంలో కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. పేద ప్రజలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడడం సరికాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.

Next Story