- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: సిరాజ్, సమీర్‌కు మరో 3 రోజుల పాటు రిమాండ్
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్‌కు కస్టడీ ముగిసింది....

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు(Vizianagaram blasts conspiracy case)లో నిందితులు సిరాజ్(Siraj), సమీర్(Sameer)కు కస్టడీ ముగిసింది. విజయనగరం పోలీసు శిక్షణా కాలేజీలో ఆరో రోజుల పాటు విచారించిన ఎన్ఐఏ అధికారులు(NIA Officers) కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో మరో మూడు రోజుల పాటు ధర్మాసనం రిమాండ్ విధించింది. ఈ మేరకు ఇద్దర్నీ జైలుకు తరలించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరుతో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. కానీ నిఘాను కొనసాగించింది. ఈ క్రమంలో విజయనగరంలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న ఎన్ఐఏ.. ఇద్దరు నిందితులు సిరాజ్, సమీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అయితే ఉగ్రలింకుల గుట్టును రట్టు చేసేందుకు మరింత విచారణలో భాగంగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అధికారులు కోరారు. దీంతో కోర్టు అనుమతించడంతో సిరాజ్, సమీర్‌ను 6 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు సాయంత్రంతో కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.






