Vizag: పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి ఉక్కు కార్మికుల పాలాభిషేకం

by Ramesh Goud |   (  Updated:2025-01-18 14:03:46  IST  )

విశాఖ ఉక్కు పరిరక్షణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM pawan Kalyan) పాత్ర కీలకమని, ఆయన కార్మికుల పక్షాన చిత్తశుద్ధితో పోరాటం చేశారని కార్మికులు(Workers) అన్నారు.

Vizag: పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి ఉక్కు కార్మికుల పాలాభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరిరక్షణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాత్ర కీలకమని, ఆయన కార్మికుల పక్షాన చిత్తశుద్ధితో పోరాటం చేశారని కార్మికులు(Workers) అన్నారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం(Vizag Steel Plant) కార్మికులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం(Milk Annointing) చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీ విశాఖ ఉక్కుకు వరమని, కార్మికుల చిరకాల వాంఛ నెరవేరడానికి కూటమి ప్రభుత్వం(NDA Government) కృషి చేసిందని తెలిపారు.

కేంద్ర సాయం పట్ల కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల ఎదుట పరిశ్రమ పరిరక్షణకు బలంగా వాదన వినిపించారని అన్నారు. విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన కృషి ఫలించి నేడు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు.

Next Story