- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోన్ యాప్స్ వేధింపులా? ఈ నంబర్స్‌కు కాల్ చేయండి
దేశంలో లోన్ యాప్స్ వేధింపులు పెరిగిపోతున్నాయి. డాక్యుమెంట్స్ లేకుండా ఇన్ స్టంట్ లోన్స్ ఇస్తామంటే ఆకర్షించి డబ్బులు కట్టకపోతే వేధిస్తున్నారు. ఏజెంట్లతో ఫోన్లు చేపించి డబ్బు కట్టే వరకు వినియోగదారులను టార్చర్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో లోన్ యాప్స్ వేధింపులు పెరిగిపోతున్నాయి. డాక్యుమెంట్స్ లేకుండా ఇన్ స్టంట్ లోన్స్ ఇస్తామంటే ఆకర్షించి డబ్బులు కట్టకపోతే వేధిస్తున్నారు. ఏజెంట్లతో ఫోన్లు చేపించి డబ్బు కట్టే వరకు వినియోగదారులను టార్చర్ చేస్తున్నారు. కొన్ని లోన్ యాప్స్ కంపెనీలు లోన్ తీసుకుని కట్టని వాళ్ల ఫోటోలు, వీడియోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెదింరింపులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వేధింపులను అరికట్టేందుకు వైజాగ్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇన్ స్టంట్ లోన్ యాప్స్ మాయలో పడి జీవితాలను బలిచేసుకోవద్దని సూచిస్తున్నారు.
ఆ యాప్స్ డౌన్లోడ్ చేస్తే, వ్యక్తిగత ఫోటోలు, సమాచారం సైబర్ నేరగాళ్ల వశం అవుతుందని.. ఆపై మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు పాల్పడతారని చెబుతున్నారు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. లోన్ యాప్స్ పేరుతో వేధింపులకు పాల్పడితే బాధితులు 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతే కాకుండా వేధింపులపై హీరో అఖిల్, జబర్దస్త్ నటులతో ఓ అవగాహన వీడియోను రూపొందించి విడుదల చేశారు.






